Tamil Nadu Lockdown : తమిళనాడులో కరోనా కల్లోలం.. ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌..

తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం రాష్టవ్యాప్తంగా రేపు పూర్తి లౌక్‌ ప్రకటించింది.

Tamil Nadu Lockdown : తమిళనాడులో కరోనా కల్లోలం.. ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌..

Tamil Nadu Lockdown Tamil Nadu Announces Lockdown This Sunday Amid Covid Surge

Updated On : January 22, 2022 / 6:43 AM IST

Tamil Nadu Lockdown : తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి దిశగా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా కేసుల తీవ్రత పెరిగిపోవడంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్టవ్యాప్తంగా రేపు (ఆదివారం) పూర్తి లౌక్‌డౌన్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. విమానాశ్రయాలకు, బస్, రైల్వేస్టేషన్లకు, ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటోలు, టాక్సీలను మాత్రం అనుమతిస్తారు. తమిళనాడులో గురువారం కొత్తగా 28,561 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

దాంతో రాష్ట్ర కరోనా కేసుల సంఖ్య 30,42,796కు చేరుకుంది. కరోనా రికవరీల సంఖ్య 28,26,479కి చేరుకుంది. గత 24 గంటల్లో 19,978 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇంకా 1,79,205 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా 10 లక్షల మందికి ‘ముందుజాగ్రత్త బూస్టర్ డోస్’ అందించాలని ఆరోగ్య శాఖ భావిస్తున్నట్లు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,51,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,60,58,806కి చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారిన పడి 703 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,88,396కి చేరింది.

Read Also : Janasena : సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన వ్యక్తితో పార్టీకి సంబంధం లేదన్న జనసేన