ఇంటిముందు ముగ్గులు వేసినందుకు: మహిళలు అరెస్ట్..కేసులు 

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 05:56 AM IST
ఇంటిముందు ముగ్గులు వేసినందుకు: మహిళలు అరెస్ట్..కేసులు 

Updated On : December 30, 2019 / 5:56 AM IST

ఇంటిముందు ముగ్గులు వేశారని మహిళలపై పోలీస్ కేసులు ఇంటిముందు ముగ్గులు వేశారని ఏడుగురు మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏడుగురు మహిలపై పోలీసులు కేసులు పెట్టారు. అదేంటి ఇంటి ముందు ముగ్గులు వేస్తే..నేరమా? కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? అని ఆశ్చర్యపోవచ్చు. అసలు విషయం ఏమిటంటే దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే.

దీనిపై బెంగాల్‌, కేరళ, యూపీ, ఢిల్లీ, అసోం, తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై బీసెంట్‌ నగర్‌ వీధుల్లో మహిళలు సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసన ముగ్గులు వేశారు. “No to CAA”, “No to NRC” అనే డిజైన్ తో ముగ్గులు వేశారు. డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్, డిఎంకె ఎంపి కనిమోళి నివాసం వెలుపల ముగ్గులతో నిరసన వ్యక్తంచేశారు.

దీంతో పోలీసులు నలుగురు మహిళలు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ముగ్గుల ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారని కేసులు కూడా నమోదు చేశారు. మహిళలపై కేసులు పెట్టటంపై డీఎంకేనేత స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎంతమందిని అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు.