TMC Recruitment 2021 : 175 నర్సు పోస్టుల భర్తీ
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం), డిప్లొమా ఇన్ అంకాలజీ, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం కలిగిన వారు అర్హులు.

Nurse Jobs
TMC Recruitment 2021 : భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కి చెందిన వారణాసిలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, పండిట్ మదన్ మోహన్ మాళవీయ క్యాన్సర్ సెంటర్లలో నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం), డిప్లొమా ఇన్ అంకాలజీ, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం కలిగిన వారు అర్హులు. పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలి. జీతభత్యాలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.44,900 నుంచి రూ.53,100+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ,రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తును ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా జనవరి 08 నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్‌కాపీ పంపడానికి చివరి తేదీగా జనవరి 15గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ; https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=9111 సంప్రదించగలరు.