శబరిమల ప్రసాదం డోర్‌ డెలివరీ…దేవస్థానం కీలక నిర్ణయం

  • Published By: bheemraj ,Published On : November 7, 2020 / 03:21 AM IST
శబరిమల ప్రసాదం డోర్‌ డెలివరీ…దేవస్థానం కీలక నిర్ణయం

Updated On : November 7, 2020 / 7:47 AM IST

Sabarimala Prasadam : కరోనా నేపథ్యంలో ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే పోస్ట్‌ ద్వారా అందించాలని నిర్ణయించింది.



శుక్రవారం నుంచి నుంచి ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షించే ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది.నవంబర్ 16న ఆలయం తెరుచుకోనుంది. ఆ రోజు నుంచే ప్రసాదం డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.



ప్రసాదం ప్యాకెట్లకు ప్రాధాన్యమిస్తామని, స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా డెలివరీ చేస్తామని ఇండియా పోస్ట్‌ అధికారి తెలిపారు. కేరళలోని ప్రాంతాలకు రెండ్రోజుల్లో, ఇతర రాష్ట్రాలకైతే వారం రోజుల్లో డెలివరీ చేయనున్నట్లు టీబీడీ చైర్మన్‌ పేర్కొన్నారు.