KCR: సీఎం కేసీఆర్.. మహారాష్ట్రపై ఎందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టారంటే..!

మహారాష్ట్ర రాజకీయాల్లో.. కారు స్పీడ్ పెంచేందుకు గ్రౌండ్ లెవెల్‌లో బలమైన పునాది వేస్తున్నారు కేసీఆర్. అక్కడ పార్టీ విస్తరణ కోసం.. తెలంగాణ సంక్షేమ మోడల్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు.

KCR: సీఎం కేసీఆర్.. మహారాష్ట్రపై ఎందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టారంటే..!

CM KCR talks of Telangana model in Maharashtra

CM KCR: జాతీయ రాజకీయాల్లో ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించాలని భావిస్తున్న కేసీఆర్.. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర రాజకీయాల(Maharashtra Politics) మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అక్కడ కూడా.. తెలంగాణ మోడల్ (Telangana model) ఎజెండానే ఎంచుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. మరాఠీలకు పరిచయం చేస్తూ.. ఇప్పటి నుంచే అక్కడ ఎలక్షన్ ఎజెండా (Election Agenda) సెట్ చేస్తున్నారు కేసీఆర్. అయితే.. కారు పార్టీ ఫార్ములా.. మహారాష్ట్రలో వర్కవుట్ అవుతుందా?

బీఆర్ఎస్ విస్తరణే లక్ష్యంగా ముందుకెళ్తున్న గులాబీ బాస్ కేసీఆర్.. తన మార్క్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ముందుగా మహారాష్ట్రలో పార్టీని జనంలోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెంచారు. ఈ మధ్యకాలంలో కారు పార్టీలో చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్న నేతలతో పాటు మాజీ నాయకులు, మేధావులు.. మఠాటీ ప్రజలు కూడా గులాబీ గూటికి చేరుకుంటున్నారు. వరుస బహిరంగ సభలు, నేతల చేరికలతో.. మహారాష్ట్రలో రాజకీయాల్లో హీట్ పెంచుతున్నారు కేసీఆర్. నాందేడ్ నుంచి మొదలుపెడితే.. తాజాగా జరిగిన సర్కోలి సభ దాకా.. గులాబీ జెండాను మహారాష్ట్ర జనానికి పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో.. తన పొలిటికల్ ఎజెండాను కూడా అక్కడి ప్రజలు, పాలిటిక్స్‌కు పరిచయం చేస్తున్నారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో.. కారు స్పీడ్ పెంచేందుకు గ్రౌండ్ లెవెల్‌లో బలమైన పునాది వేస్తున్నారు కేసీఆర్. అక్కడ పార్టీ విస్తరణ కోసం.. తెలంగాణ సంక్షేమ మోడల్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. పార్టీలో చేరేందుకు వస్తున్న నాయకులకు.. ఇక్కడ జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని కళ్లకు కడుతున్నారు. దీనికోసం.. తెలంగాణ అభివృద్ధిపై మరాఠీ నేతలకు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ వచ్చిన మరాఠా నేతలను జిల్లాలకు తీసుకెళ్లి.. వారు స్వయంగా ఇక్కడి సంక్షేమం గురించి తెలుసుకునేలా పక్కా ప్లాన్ అమలు చేస్తోంది గులాబీ దళం. బహిరంగ సభల్లోనూ మహారాష్ట్రకు సంబంధించి తన విజన్ ఏంటో.. సూటిగా చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్

ముఖ్యంగా మరాఠా గడ్డపై బీఆర్ఎస్ ఎందుకు ప్రత్యామ్నాయం అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, 24 గంటల కరెంటు, ఆసరా ఫించన్లు, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, గొర్రెల యూనిట్ల పంపిణీ.. ఇలా అన్ని పథకాల గురించి వివరిస్తున్నారు. మహారాష్ట్రలో తమను గెలిపిస్తే.. ఇక్కడ అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అక్కడ కూడా అమలు చేస్తామని చెబుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్.

Also Read: 600 కార్ల భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడంపై శరద్ పవార్ కామెంట్స్..

ఇక.. తెలంగాణ సంక్షేమ పథకాలపై.. మరాఠీ మీడియాలోనూ విరివిగా ప్రచారం చేస్తోంది సర్కార్. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో.. మరాఠా రాజకీయాల్లో రైతు ఎజెండాను తెరమీదకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలు, అవి పూర్తయితే రైతులకు చేకూరే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇక్కడికి వచ్చే మరాఠీ నేతలను.. ప్రాజెక్ట్ సైట్‌కు తీసుకెళ్తోంది సర్కార్. తెలంగాణ మోడల్‌ను.. మహారాష్ట్రలో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేందుకు గులాబీ దళపతి పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడి సంక్షేమంపై.. కొందరు మహారాష్ట్ర మేధావులతో.. ప్రత్యేక శిక్షణా తరగతులను సైతం నిర్వహిస్తోంది. నెమ్మదిగా.. తెలంగాణ వెల్ఫేర్ ఫార్ములాను.. మహారాష్ట్ర రాజకీయాల్లోకి ఇంకించాలనే కేసీఆర్ వ్యూహం.. ఏ మేరకు ఫలిస్తుందన్నదే.. ఆసక్తి రేపుతోంది.