చైనా నుంచి వచ్చిన తెలుగువాళ్లు స్వస్థలాలకు…

  • Published By: vamsi ,Published On : February 18, 2020 / 07:34 AM IST
చైనా నుంచి వచ్చిన తెలుగువాళ్లు స్వస్థలాలకు…

Updated On : February 18, 2020 / 7:34 AM IST

ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19).. ఈ వైరస్ కరణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే వేల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉండగా.. వందల్లో ప్రాణాలను కోల్పోయారు. భారత్‌లో మాత్రం ఈ వైరస్ ప్రభావం లేదు. లేటెస్ట్‌గా ఈ వైరస్ సోకి వూహాన్ నుంచి వచ్చిన వారిలో 23 మంది ఆంధ్ర, తెలంగాణ వారిని రాష్ట్రాలకు తీసుకుని రానున్నారు. 

చైనాలోని వూహన్ సిటీలో కరోనా వైరస్ ప్రభావం విపరీతంగా ఉండగా.. నగరంలో చిక్కుకున్న భారతీయులను రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకుని వచ్చింది కేంద్రం. తొలిసారి 324 మందిని, తర్వాత 323 మందిని కలిపి మొత్తం 647 మంది భారత్ తీసుకుని వచ్చింది కేంద్రం. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది ఉండగా.. వీరందరినీ అప్పటి నుంచి ఢిల్లీలోని ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి అవసరమైన పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో కోవిడ్-19 భారిన పడలేదని తేలడంతో.. వారికి కరోనా వైరస్ సోకలేదన్న నిర్ధారణ సర్టిఫికేట్లను ఇచ్చి పంపుతున్నారు. చైనాలోని వూహాన్ నగరం నుంచి వారు వచ్చి దాదాపు పది హేను రోజులయ్యింది.  వీరిని ప్రత్యేక గదుల్లో ఉంచి పలు రకాల టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం వీరికి కోవిడ్-19 లేదు అని తెలిపే సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఇవాళ(18 ఫిబ్రవరి 2020) సాయంత్రానికి వీరు వారి స్వస్థలాలకు చేరుకోనున్నారు.