పొంగల్ గిఫ్ట్: రేషన్ షాపులు కిటకిట.. నో క్యాష్ బోర్డులు

తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు రూ.వెయ్యి క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద వెయ్యి రూపాయల కోసం భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు.

  • Published By: sreehari ,Published On : January 10, 2019 / 07:00 AM IST
పొంగల్ గిఫ్ట్: రేషన్ షాపులు కిటకిట.. నో క్యాష్ బోర్డులు

తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు రూ.వెయ్యి క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద వెయ్యి రూపాయల కోసం భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు.

అధురై: తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు రూ.వెయ్యి క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద వెయ్యి రూపాయల కోసం భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. ఎక్కడ చూసిన రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల మహిళలు పిల్లలను చంకలో ఎత్తుకొని మరి రేషన్ షాపుల దగ్గర క్యూలో నిలుచున్నారు. ఉదయం నుంచే భారీ క్యూ పెరిగిపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల క్యాష్ రివార్డు కోసం రేషన్ షాపుల వద్ద కొట్టేసుకుంటున్నారు. నెట్టుకుంటున్నారు. నేను ముందుంటే.. నేను ముందు వచ్చానని గొడవ పడుతున్న పరిస్థితి నెలకొంది. 

ముందుగా మాకే ఇవ్వాలి.. మహిళలు ఆగ్రహం
లేడిస్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ఒకవైపు పురుషులతో మహిళలు వాదనకు దిగితే.. చంటి పిల్లలతో వచ్చిన మహిళలు తమకే ముందు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డు షాపు నిర్వహకులు వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రేషన్ షాపుల వద్ద నగదు ఖాళీ కావడంతో వచ్చినవారంతా ఉత్త చేతులతోనే వెళ్లిపోతున్నారు. ఆగ్రహించిన కస్టమర్లకు రేషన్ షాపు నిర్వహకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రేషన్ కార్డు కలిగిన వారికి అందిస్తామని చెబుతున్నారు. కొన్ని షాపుల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో కస్టమర్లు మండిపడుతున్నారు.