Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ లో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి

Terrarist Attack

Updated On : June 12, 2021 / 3:12 PM IST

Terrorist Attack: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ లో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు ప్రారంభించాయి. కాగా గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్, కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మరోవైపు భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఐఈడీ బాంబులు పెడుతున్నారు. తాజాగా రెండు ఐఈడీ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. ఇక ఓ తోటలో ఉంచిన 5 కేజీల పేలుడు పదార్దాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థం కేసుపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.