Central Govt : 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం వేటు

తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేసే వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేసుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ లైన్‌ను కూడా తెరిచింది.

Central Govt : 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం వేటు

Whatsapp

Updated On : June 20, 2022 / 8:44 AM IST

central government : ‘అగ్నిపథ్’పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఆ గ్రూపులను కేంద్రం నిషేధించింది. తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేసే వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేసుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ లైన్‌ను కూడా తెరిచింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అమవుతున్నాయి. ఈ క్రమంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు అగ్నిపథ్‌ స్కీమ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థలే విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

Three Forces : ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఆర్మీలో ప్రవేశం లేనట్లే..!

ఆందోళనలో పాల్గొని ఎఫ్‌ఐఆర్‌ నమోదైన యువకులను.. ఎట్టి పరిస్థితుల్లో సైన్యంలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయని, ఆస్తుల విధ్వంసానికి తావు లేదన్నారు. ప్రతి అభ్యర్థి నిరసనల్లో పాల్గొనలేదని ధ్రువపత్రం సమర్పించాలి ఉంటుందని, అది లేకుంటే ఎవరినీ చేర్చుకునేది లేదన్నారు.