Gulab Cyclone Baby’s : తుఫాన్‌ సమయంలో ప్రసవించిన 41మంది గర్భిణులు..శిశువులకు ‘గులాబ్’ పేరు

గులాబ్ తుఫాను వేళ 41మంది గర్భిణులు ప్రసవించారు. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు తల్లులు వారి బిడ్డలకు ‘గులాబ్’ అని పేరు పెట్టుకున్నారు.

Gulab Cyclone Baby’s : తుఫాన్‌ సమయంలో ప్రసవించిన 41మంది గర్భిణులు..శిశువులకు ‘గులాబ్’ పేరు

Gulab Cyclone Babys In Odisha

Updated On : September 28, 2021 / 12:27 PM IST

Gulab Cyclone Baby’s  In Odisha: గులాబ్ తుపాన్ గుబులు పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ఇటు ఏపీని అటు ఒడిశాని కూడా గడగడలాడిస్తోంది. ఒడిశాలోని పూరి, గంజాం, గజపతి, ఇక ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై గులాబ్‌ తుపాను ప్రభావం పడుతోంది.

ఈ గులాబ్ తుఫాను ప్రభావానికి హోరుగాలి..కుండపోత వానతో గులాబ్ గుబులు పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ తుఫాను వేళ ఒడిశాలో 41మంది గర్భిణులు ప్రసవించారు. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. అలా గులాబ్ తుఫాను వేళ పుట్టిన తమ బిడ్డలకు ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఇద్దరు మహిళలు తమ ఆడబిడ్డలకు ‘గులాబ్’ తుపాను పేరు పెట్టుకున్నారు.

Read more : interesting King : ఆ రాజుకు 365 మంది భార్యలు..వారి పేర్లతో 365 లాంతర్లు..విశేషాల రాజు వెనుక చరిత్ర

ఒడిశా రాష్ట్రానికి చెందిన కునీరైట్, నందిని సబర్ అనే మహిళలకు వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గులాబ్ తుపాన్ సంభవించిన రోజే ఆడబిడ్డల్ని ప్రసవించారు. గులాబ్ తుపాన్ వేళ జన్మించిన తమ బిడ్డలకు గులాబ్ పేరు పెట్టమని ఆసుపత్రి నర్సులు తల్లులకు సూచించగా పేరు భలే ఉందని అదే పేరు పెట్టారు.

కాగా ప్రకృతి బీభత్సం సంభవించినప్పుడు గర్భంతో ఉన్న మహిళలకు కాస్త ఉద్వేగానికి గురి అవుతారు. ఆ క్రమంలో నెలలు నిండి ఉంటే ప్రసవం జరుగుతుంది. అలా గులాబ్ తుఫాను వేళ ఒడిశాలో 41మంది గర్బిణులు ప్రసవించారు. బిడ్డలంతా క్షేమంగా ఉన్నారు.

Read more : US Marine: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..

సోరడపల్లి గ్రామానికి చెందిన నందిని సబర్ కు హెల్త్ సెంటరులో ఆడబిడ్డను ప్రసవించింది.అంకులి పంచాయతీలోని కమ్యూనిటీ ఆసుపత్రిలో కునీరైట్ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.హోరు గాలిలో కుండపోత వర్షం కురుస్తుండగా పుట్టిన బిడ్డలకు గులాబ్ తుపాన్ గుర్తుగా గులాబ్ పేరు పెట్టారు. ‘‘నా బిడ్డ అందరికీ గుర్తుండిపోయే రోజు జన్మించినందున నా బిడ్డకు సంతోషంగా గులాబ్ పేరు పెట్టాను’’ అని నందిని సబర్ తెలిపింది.

కాగా.. గంజాం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఉమాశంకర్ మిశ్రా మాట్లాడుతు..గులాబ్ తుపాన్ సమయంలో 241 మంది గర్భిణులను ప్రసవం కోసం సమీప ఆసుపత్రులకు తరలించామని..గులాబ్ తుపాన్ తీరాన్ని సమీపిస్తున్నపుడు 41 మంది మహిళలు ప్రసవించారని ..తల్లీ బిడ్డలు అంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.