Mumbai : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రస్తుతం ఏసీ రైళ్లలో 5కిలోమీటర్లకు గరిష్ఠ ఛార్జీ 65 రూపాయలు ఉండగా.. దాన్ని 30 రూపాయలకు తగ్గిస్తున్నట్టు రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్‌ చెప్పారు.

Mumbai : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

Mubai Local Ac Trains

Updated On : April 30, 2022 / 8:02 AM IST

Mumbai local AC trains : ముంబై ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. లోకల్‌ ఏసీ రైళ్లలో ఛార్జీలను 50శాతం మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఏసీ రైళ్లలో 5కిలోమీటర్లకు గరిష్ఠ ఛార్జీ 65 రూపాయలు ఉండగా.. దాన్ని 30 రూపాయలకు తగ్గిస్తున్నట్టు రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్‌ చెప్పారు.

Indian Railways : రైల్వే శాఖ కొత్త రూల్.. ఇకపై అవి ఉంటేనే టికెట్ బుకింగ్

ఈ రైళ్లలో ఛార్జీలు తగ్గించాలన్నది ప్రజల చిరకాల డిమాండ్ అని ఆయన గుర్తు చేశారు. కనీసం 20నుంచి 30శాతం తగ్గించాలంటూ తమకు విజ్ఞాపనలు వచ్చాయని అన్నారు. అయితే తగ్గించిన ఛార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయన్నది మాత్రం ఆయన పేర్కొనలేదు.