RBI : ఆర్‌బీఐ కీలక నిర్ణయం

లాకర్లపై బ్యాంకుల బాధ్యతను పరిమితం చేస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటించించింది.

RBI : ఆర్‌బీఐ కీలక నిర్ణయం

Rbi

Updated On : August 19, 2021 / 8:32 PM IST

RBI a crucial decision : లాకర్లపై బ్యాంకుల బాధ్యతను పరిమితం చేస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో చోరీ, అగ్ని ప్రమాదం, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం.. ఇలాంటి కారణాలతో లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే, వార్షిక లాకర్‌ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం లభిస్తుంది. అంతేకాదు.. లాకర్‌లలో చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని ఉంచకూడదు.

అటు ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, పిడుగులు పడడం కారణంగా లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆ బాధ్యత బ్యాంకులపై ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకులు ఈ మేరకు లాకర్‌ ఒప్పందంలో సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది.

బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్‌ లాకర్‌ లేదా సేఫ్‌ కస్టడీ ఆర్టికల్‌ సేవలను సమీక్షించిన అనంతరం.. వివిధ వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుత, నూతన కస్టమర్లకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. శాఖలవారీగా ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయనే జాబితాను నిర్వహించడమే కాకుండా.. లాకర్లు ఖాళీగా లేకపోతే ప్రతీ దరఖాస్తును విధిగా స్వీకరించి వేచి ఉండే జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించింది.