Viral Post : తండ్రిని రూ. 2 లక్షలకి అమ్మకానికి పెట్టిన కూతురు

పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. తండ్రి మీద కోపం వచ్చిన కూతురు ఏం చేసిందో చదవండి.

Viral Post : తండ్రిని రూ. 2 లక్షలకి అమ్మకానికి పెట్టిన కూతురు

Viral Post

Updated On : October 4, 2023 / 5:11 PM IST

Viral Post :  హెడ్డింగ్ చదివి  ఇదేదో సీరియస్ వార్త అనుకునేరు. చిన్నపిల్లలకు పేరెంట్స్ మీద కోపం వస్తే తీర్చుకునే రివెంజ్ స్టోరీ అన్నమాట.

Ms Dhoni New LooK: న్యూ లుక్ అదిరింది.. హాలీవుడ్ హీరోలా మహేంద్ర సింగ్ ధోనీ.. ఫొటోలు వైరల్

తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడం.. పిల్లలు వారిపై అలగడం కామనే కదా. అలాగే తండ్రీకూతురికి విభేదాలు వచ్చాయి. ఆ కూతురు తీసుకున్న రివేంజ్ చదివితే నవ్వొస్తుంది. ఆమె “ఫాదర్ ఆన్ సేల్” అనే నోటీసును ఇంటి తలుపుకి అతికించింది. అంతేనా.. తండ్రిని రూ.200,000 కి అమ్ముతున్నట్లు నోటీసులో రాసింది.  Melanchoholic అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతోంది.

Boney Kapoor : బోనీ క‌పూర్ వ్యాఖ్య‌లు వైర‌ల్.. శ్రీదేవితో నా పెళ్లికి ముందే జాన్వీ కపూర్..?

ఈ పోస్టుపై నెటిజన్లు స్పందించారు. ఈ నోట్ చూసాకా మీ బిడ్డ మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నట్లు భావిస్తున్నాము అని కొందరు.. ఆమెకు మీరంటే చాలా ప్రేమ.. ఆమెను ఎప్పుడూ ఇలా చెడ్డగానే ఉండనివ్వండి.. అంటూ మరికొందరు రిప్లై చేసారు. పిల్లలు తెలియక చేసే చిలిపి పనులు ఒక్కోసారి వినోదాన్ని కలిగిస్తుంటాయి. కానీ తండ్రితో గొడవ పడితే ఇలా కూడా స్వీట్ రివెంజ్ తీర్చుకోవచ్చా అని ఈ ఫన్నీ పోస్టు చూస్తే అర్ధమవుతోంది.