Vivek Express Train : భారత్ లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా?
భారత్ లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా? వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు దేశంలో అధిక దూరం ప్రయాణిస్తుంది.

Vivek Express Train
longest Traveling train : భారత్ లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా? వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు దేశంలో అధిక దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు దాదాపు 4,273 దూరం ప్రయాణిస్తుంది. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణం చేస్తుంది.
అయితే వివేక్ ఎక్స్ ప్రెస్ వీక్లీ రైలు. 9 రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగుతోంది. మధ్యలో 56 స్టేషన్లలో ఆగుతుంది. దిబ్రూగఢ్ లో ప్రారంభమయ్యే వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు కన్యాకుమారి చేరుకునేందుకు ఐదు రోజులు పడుతుంది.
పర్యటనకు వెళ్తున్న ప్రదేశం ప్రత్యేకతలను ముందుగా తెలుసుకుని వెళ్తే పర్యటనను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా అక్కడికి ప్రత్యేకమైన వంటలు, పండ్లు, అక్కడ మాత్రమే దొరికే వస్తువులను మిస్ కాకూడదు. టూర్ లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రం పూర్తిస్థాయిలో తీసుకోవాలి.
రోజంతా ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. పర్యటనకు వెళ్లే ముందు ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించి, సూచించిన మందులను వెంట తీసుకెళ్తే మంచింది.