Wipro : రేపటి నుంచి ఉద్యోగులు ఆఫీసుకి రావాలి
సోమవారం నుంచి ఉద్యోగులంతా కార్యాలయానికి రావాలని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. ఇకపై వారంలో రెండు సార్లు ఆఫీసుకు రావాలని వెల్లడించారు.

Wipro
Wipro : కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చేశాయి. గత 18 నెలలుగా ఎక్కువమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటివద్ద నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే విప్రో కంపెనీ తమ ఉద్యోగులు సోమవారం నుంచి కార్యాలయానికి రావాలని తెలిపింది.
Read More : School Teacher: నిన్నెవడూ కాపాడలేడంటూ.. స్కూల్ బాలికకు బలవంతంగా కేక్ రుద్దిన టీచర్ అరెస్ట్
దేశంలోని టాప్ టెన్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో విప్రో కూడా ఒకటి. ఈ కంపెనీ చైర్మన్ రషీద్ ప్రేమ్ జీ.. ఉద్యోగులు ఆఫీసుకి రావాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉద్యోగులకి టీకాలు ఇచ్చామని.. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరు కావాల్సి ఉంటుందని మిగతా మూడు రోజులు ఇంటి నుంచే పనిచేయాలని వివరించారు.
విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మూడవ వేవ్ ప్రమాదం పొంచి ఉందని సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాము. ఇప్పటికే అందరికి వ్యాక్సినేషన్ పూర్తైంది ఇక వారిని నెమ్మదిగా ఆఫిసులకు తీసుకొస్తామని తెలిపారు. మొత్తం 2 లక్షల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. 35,000 మంది పూర్తిస్థాయి వ్యాక్సిన్ ఇచ్చారు.
Read More : Tesla Car: ముందు తయారీనే.. దిగుమతి సుంకం తర్వాత చూద్దాం
ఇక దేశంలో దాదాపు 55 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తైంది.. త్వరలో మిగిలిన వారికి కూడా పూర్తి కానుంది. అయితే విప్రో బాటలోనే మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూర్ కేంద్రంగా నడుస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీలు తన ఉద్యోగులకు కార్యాలయాలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
After 18 long months, our leaders @Wipro are coming back to the office starting tomorrow (twice a week). All fully vaccinated, all ready to go – safely and socially distanced! We will watch this closely. pic.twitter.com/U8YDs2Rsyo
— Rishad Premji (@RishadPremji) September 12, 2021