ఆ వార్త ఫేక్ : నాలుగేళ్ల చిన్నారికి కరోనా లేదు..మంత్రి ట్వీట్

  • Published By: madhu ,Published On : March 22, 2020 / 05:38 AM IST
ఆ వార్త ఫేక్ : నాలుగేళ్ల చిన్నారికి కరోనా లేదు..మంత్రి ట్వీట్

Updated On : March 22, 2020 / 5:38 AM IST

కరోనా వైరస్ వ్యాపిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 2020, మార్చి 21వ తేదీ శనివారం సాయంత్రానికి 315 కేసులు రికార్డయ్యాయి. ఇదిలా కొనసాగుతుంటే ఫలానా వ్యక్తికి కరోనా సోకిందని, కేసుల సంఖ్య అధికమౌతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కరోనా బూచీపై వదంతులు కూడా వ్యాపిస్తున్నాయి. ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా హెచ్చరిస్తున్నాయి. ఇలాగే అసోం రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారికి వైరస్ సోకిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాష్ట్రంలో కలకలం రేపింది. దీనిపై స్వయంగా మంత్రి హిమాంత్ బిస్వాశర్మ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

ఈ వార్త అబద్దమని కొట్టిపారేశారు. నాలుగున్నరేళ్ల పాపకు జరిపిన వైద్య పరీక్షల్లో నెగటివ్ అని తేలిందని చెప్పారు. ఈ మేరకు ఆయన 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జోర్హాట్ మెడికల్ కాలేజీ అండ్ RMRCకి పాప శాంపిల్స్ పంపించినట్లు తెలిపారు. రిపోర్టు వచ్చిందని అందులో నెగటివ్ ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా ఆయన పోస్టు చేశారు. అసోం రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాలేదన్నారు.