డ్రైవర్ బామ్మ : 20 రకాల భారీ వాహనాలు నడిపే 69ఏళ్ల మహిళ

  • Published By: nagamani ,Published On : September 3, 2020 / 11:18 AM IST
డ్రైవర్ బామ్మ : 20 రకాల భారీ వాహనాలు నడిపే 69ఏళ్ల మహిళ

Updated On : September 3, 2020 / 11:49 AM IST

ఆడవాళ్లు టూ వీలర్ పై రయ్ మంటూ దూసుకుపోవటం సర్వసాధారణం..అంతే కాదు పెద్ద పెద్ద్ బైకుల్ని కూడా నడిపేస్తున్నారు. రేసర్లుగా దూసుకుపోతున్నారు. హెలికాప్టర్లను..విమానాలను కూడా నడిపేస్తూ..భూమి మీదనే కాదు ఆకాశంలో సైతం గెలుపు సంతకం చేస్తున్నారు.. కానీ ఒక మిణి అయినా పురుషుడైనా ఎన్ని రకాల వాహనాలను నడపగలరు? అంటే సినిమాల్లో హీరోలైతే అప్పటికప్పడు హెలికాప్టర్లను..విమానాలను కూడా నడిపేస్తుంటారు. కానీ నిజజీవితంలో ఓ వ్యక్తి ఎన్ని వాహనాలను నడపగలరు?అంటే టూ వీలర్..బైకు..కారు..వ్యాన్..ట్రాక్టర్..లారీ ఇలా ఒకటీ నుంచి నాలుగైదు రకాల వాహనాలు నడపగలరు…



కానీ…ఓ మహిళ మాత్రం నాలుగు ఐదు కాదు ఆరు ఏడు కూడా కాదు ఏకంగా 20రకాల వాహనాలకు అవలీలగా నడిపేస్తున్నారు..అదికూడా 69 ఏళ్ల వయస్సులో..ఆమె పేరు రాధామణి. వయస్సు గురించి ముందే చెప్పుకున్నాం కదా..69 ఏళ్లు. కేరళలో రాధామణియమ్మ అనేకంటే కనిపించిన వాహనాల్లా నడిపేస్తుందే ఆమెనే అని అంటారు..





రాధామణియమ్మ టూ వీలర్ నుంచి రోడ్డు రోలర్ వరకూ 20 రకాల వాహనాల స్ట్రీరింగుల్ని విష్ణు చక్రంలా తిప్పేయగలరు. లారీ, బస్సు, ఎర్త్ మూవర్, ఫోర్క్ లిఫ్ట్, మొబైల్ క్రేన్, పెద్ద పెద్ద క్రేన్లు, రోడ్డు రోలర్ వంటివాటిని పరిగెత్తించటం ఆమెకు చిటికె వేసినంత సులభం..ఆమె ఏదో ఆషామాషీగా వాటిని నడపరు..ఆమె దగ్గర 11 రకాల వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్సులున్నాయి.
https://10tv.in/husband-cut-her-wife-two-legs-in-chittoor-srikalahasthi/
కేరళకు చెందిన రాధామణి 1981లో మొదటిసారి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకున్నారు. 1988లో మెవీ మోటార్ డ్రైవింగ్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఈ కాలంలో ఈ లైసెన్సులు తీసుకున్నవారు ఒకరిద్దరు మాత్రమే. 1978లో రాధామణి భర్త తొప్పుంపాడీలో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించేవారు. రకరకాల వాహనాలు నడిపేలా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చేవారాయన.



ఆ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ కు రాధామణి అప్పుడప్పుడు వెళుతుండేవారు. అలా ఆమె అక్కడ రకరకాల వాహనాలు చూసి నేను కూడా ఈ వాహనాల్ని నడిపితే ఎలా ఉంటుందని కోరిక కలిగింది. అలా తనకోరికను భర్తకు చెప్పింది. తరువాత అక్కడ రకరకాల వాహనాలు లైట్ వి భారీ వాహనాలను కూడా నడపటం నేర్చుకున్నారు. నేర్చుకుని ఊరుకోకుండా భారీ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్సులు కూడా సంపాదించారు.



అలా పలురకాల వాహనాల స్ట్రీరింగులు ఆమె చేతిలో అవలీలగా..విష్ణుచక్రాల్లా గిర్రున తిరుగుతాయి..భారీ వాహనాలు నడపటంలో రాధారాణి దిట్ట. అలా ఆమె ఎన్ని వాహనాలు నడిపినా..గత 32 ఏళ్లనుంచి ఒక్కటంటే ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు అంటే ఆ భారీ వాహనాలపై ఆమె పట్టు ఎంతగా సాధించారో ఊహించుకోవచ్చు…