Durga Puja pandal : దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట…ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లోని దుర్గా పూజ పండల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు.,,,

stampede
Durga Puja pandal : దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లోని దుర్గా పూజ పండల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి పూజా మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు మృతి చెందడంతో పండుగ వేడుక విషాదంగా మారింది. గోపాల్ గంజ్ పట్టణంలోని రాజా దళ్ ప్రాంతంలో దుర్గాపూజ పండుగ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.
Also Read : Kangana Ranaut : ఢిల్లీలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయబోయే తొలి సెలిబ్రిటీ ఎవరంటే…
ఈ తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. కిక్కిరిసిన వేడుకల మధ్య ఓ బాలుడు కిందపడి పోయాడు. బాలుడిని రక్షించే యత్నంలో ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి కింద పడిపోవడంతో భక్తులు ప్రసాదం స్వీకరించేందుకు బారులు తీరారని, ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ స్వర్ణ ప్రభాత్ తెలిపారు.
Also Read : Hamas releases : హమాస్ సంచలన నిర్ణయం…మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీల విడుదల
తర్వాత జరిగిన గొడవలో 13 మంది మహిళలు, చిన్నారికి గాయాలయ్యాయి. వారిని సదర్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఎస్పీ తెలిపారు.