ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్
Tik Tok... పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాప్. మరీ ముఖ్యంగా యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది. ఎంతగా పాపులర్ అయిందో, అంతే

Tik Tok… పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాప్. మరీ ముఖ్యంగా యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది. ఎంతగా పాపులర్ అయిందో, అంతే
Tik Tok… పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాప్. మరీ ముఖ్యంగా యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది. ఎంతగా పాపులర్ అయిందో, అంతే వివాదాస్పదమైంది. మ్యాటర్ ఎంతవరకు వెళ్లిందంటే.. ఏకంగా టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. టిక్ టాక్ వీడియోల్లో పెరిగిన అశ్లీలత, బూతు కంటెంట్ అందుకు ప్రధాన కారణం. రోజుకి రోజుకి తలనొప్పులు పెరిగిపోతుండటంతో టిక్ టాక్ దిగొచ్చింది. కీలక నిర్ణయాలు తీసుకుంది.
టిక్ టాక్ 60లక్షల వీడియోలను డిలీట్ చేసింది. భారత ప్రభుత్వం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా వీడియోలను డిలీట్ చేశామని టిక్ టాక్ చెప్పింది. 2018 జూలై నుంచి ఇప్పటివరకు ఉన్న వీడియోలను తొలగించామంది. టిక్ టిక్ యూజర్ల భద్రత, సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు ఏజ్ లిమిట్ కూడా ఫిక్స్ చేసింది. ఇకపై 13ఏళ్లు పైబడిన వారికే టిక్ టాక్ అకౌంట్ ఇస్తారు. 13ఏళ్ల లోపు పిల్లలు టిక్ టాక్ లోకి లాగిన్ అవ్వలేరు. టిక్ టాక్ సేఫ్టీ సెంటర్ కూడా ఓపెన్ చేసింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, తమిల్, కన్నడ, మలయాళీ, ఒరియా భాషల్లో దీన్ని తీసుకొచ్చారు.
Read Also : నువ్వొద్దమ్మా : తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన నటి సంగీత
టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై చర్చలు జరగుతున్నాయి. చైనాకు చెందిన ఈ వీడియో యాప్.. పిల్లల్లో అశ్లీల ప్రవృత్తిని పెంచుతోందని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. టిక్ టాక్ ను బ్యాన్ చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారిస్తున్న మద్రాసు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్ టాక్ యాప్ పిల్లలపై ప్రభావం చూపుతోందని చెప్పింది.
టిక్ టాక్ లో ఉన్న వీడియోలను వాడొద్దని మీడియాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టిక్ టాక్ యాప్‌పై మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ కేసును పరిశీలిస్తోంది. టిక్ టాక్ వాడుతున్న పిల్లలు.. లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు కోర్టు చెప్పింది. చిన్న చిన్న వీడియోలు తీసి, వాటికి స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించి.. టిక్‌టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ యాప్‌కు ఇండియాలో 6కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
Read Also : కోడెలపై దాడి : అంబటి రాంబాబుపై హత్యాయత్నం కేసు