Covid-19 : భారత్ లో భారీగా తగిన కరోనా కేసులు
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులు శుక్రవారం భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Covid 19
Covid-19 : గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులు శుక్రవారం భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,74,954 కు చేరింది. శుక్రవారం నమోదైన కేసులతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,90,646 చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.69 శాతంగా ఉంది.
ఇక దేశంలో తాజాగా 338 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,42,009 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,681 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా రికవరీల సంఖ్య 3,23,42,299 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 72,37,84,586 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదవుతున్నాయి.
దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కరోనా కేసులు ఇక్కడే నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇక్కడ మృతుల్లో ఎక్కువమంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.