Nithin Mithali Raj Meets JP Nadda : బీజేపీకి జై కొట్టిన నితిన్, మిథాలీ రాజ్..! ప్రచారం చేసేందుకు సుముఖత..!

బీజేపీకి జైకొట్టారు హీరో నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ పాలనకు ఆకర్షితులైన నితిన్, మిథాలీ బీజేపీ కోసం పని చేస్తామని చెప్పారని అన్నారు.

Nithin Mithali Raj Meets JP Nadda : బీజేపీకి జై కొట్టిన నితిన్, మిథాలీ రాజ్..! ప్రచారం చేసేందుకు సుముఖత..!

Updated On : August 27, 2022 / 11:17 PM IST

Nithin Mithali Raj Meets JP Nadda : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించగా.. ఇప్పుడు సెలెబ్రిటీలు, క్రికెటర్లతో వరుస సమావేశాలు నిర్వహించారు బీజేపీ టాప్ లీడర్స్. తెలంగాణలో ఒకరోజు పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్రికెటర్ మిథాలీ రాజ్, హీరో నితిన్ తో భేటీ అయ్యారు. వీరిద్దరితో వేర్వేరుగా సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో బీజేపీకి జైకొట్టారు హీరో నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ పాలనకు ఆకర్షితులైన నితిన్, మిథాలీ బీజేపీ కోసం పని చేస్తామని చెప్పారని అన్నారు. మోదీ సూచనతో మొదట నడ్డాను కలిశారు. త్వరలోనే ప్రధానితో వీరిద్దరూ భేటీ కానున్నారని లక్ష్మణ్ తెలిపారు.