ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్-10 విమానాశ్రయాలు ఇవే.. మన దేశ ఎయిర్‌పోర్ట్ కూడా..
Top 10 busiest airports: టాప్ 10 జాబితాలోని ఐదు విమానాశ్రయాలు యునైటెడ్ స్టేట్స్‌లోనే ఉన్నాయి.

igi airport
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్-10 విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఆ విమానాశ్రయం 10వ స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా అన్ని దేశాల వారీగా కలుపుతూ ఆర్థిక వృద్ధికి విమానాశ్రయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
టాప్ 10 జాబితాలోని ఐదు విమానాశ్రయాలు యునైటెడ్ స్టేట్స్‌లోనే ఉన్నాయి. టోక్యో హనేడా విమానాశ్రయం ర్యాంకింగ్స్‌లో గతంలో 16వ స్థానంలో ఉండగా ఇప్పుడు 5వ స్థానానికి చేరింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజాగా ఓ నివేదికలో రద్దీగా వినామాశ్రయాల పేర్లను పేర్కొంది. దాని ప్రకారం…
రద్దీగా ఉండే టాప్-10 విమానాశ్రయాలు
1. హార్ట్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం
2. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
3. డల్లాస్/ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం
4. హీత్రో విమానాశ్రయం, లండన్
5. టోక్యో హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం, టోక్యో
6. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం, డెన్వర్
7. ఇస్తాంబుల్ విమానాశ్రయం, టర్కీ
8. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
9. చికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం
10. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ
Also Read: ఏపీని ఏకీపారేస్తున్న ఎండలు.. వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు.. ఉదయం నుంచే ఉక్కపోత..