కాంగ్రెస్ నేతలకు పీఏసీ మీటింగ్ టెన్షన్.. రాష్ట్ర స్థాయి మీటింగ్‌కు నేషనల్ లీడర్
స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా పీఏసీ మీటింగ్‌లో చర్చకు రానుంది.

అధికార కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? హటాత్తుగా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి? రాష్ట్ర స్థాయి సమావేశానికి నేషనల్ లీడర్ ఎందుకు వస్తున్నారు? కేసీ వేణుగోపాల్ తెలంగాణ పర్యటన వెనకున్న మతలబేంటి? పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పై కేసీ క్లాస్ తీసుకుంటారా.. పనిచేయని నేతలపై యాక్షన్ తీసుకుంటారా.. లెట్స్ వాచ్
గాంధీభవన్ వేదికగా బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సాధారణంగా పీఏసీ సమావేశాలకు పీఏసీ సభ్యులతో పాటు పార్టీ ఇన్‌చార్జ్ హాజరవుతుంటారు. కానీ తెలంగాణ పీఏసీ సమావేశానికి తొలిసారి ఏఐసీసీ కీలక నేత రాబోతున్నారు. ఏఐసీసీ తరఫున పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీఏసీ మీటింగ్‌కు రానున్నట్లు గాంధీభవన్ వర్గాలు ప్రకటించాయి. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది.? కేసీ ఎందుకు వస్తున్నారని పార్టీ నేతల్లో సీరియస్ డిస్కషన్ నడుస్తోంది.
పార్టీ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ అధ్యక్షతన జరగనున్న పీఏసీ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మీటింగ్ ఎజెండా కూడా రెడీ చేసినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా పాలన తీరు, పార్టీ పరిస్థితిని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని పార్టీ పెద్దలు భావించారు. దీనిలో భాగంగానే పీఏసీ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే
ఏడాది పాలనలో ఏం సాధించాం? భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశంపై పీఏసీ మీటింగ్‌లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఒక సీక్రెట్ సర్వే చేపట్టిందని గాసిప్ వినిపిస్తోంది. ఆ సర్వే రిపోర్ట్ పార్టీకి చేరిందట. ఆ రిపోర్టులో ఏ పథకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అనే అంశాలపై పూర్తి అధ్యయనం చేసినట్లు సమాచారం. ఇక సీఎంతో సహా డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల వారీగా సునీల్ కనుగోలు టీమ్‌తో సర్వేలు చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది ఎమ్మెల్యేలు, కొందరు కీలక నేతల తీరుపై పలు కంప్లైట్స్ ఉన్నాయట. కొందరు మంత్రుల పనితీరుపై కూడా విమర్శలు వస్తున్నాయట. దీంతో ఆ ప్రోగెస్‌లో ఏముందనే టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది.
గత బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేల ప్రవర్తననే ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమైందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో ఎమ్మెల్యేల పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టిందట. ఎమ్మెల్యేలంతా జాగ్రత్తగా ఉండాలని కేసీ వేణుగోపాల్ దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.
పార్టీ టార్గెట్ ఏంటి?
ఇక స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా పీఏసీ మీటింగ్‌లో చర్చకు రానుంది. జనవరి 26న ప్రభుత్వం రైతు భరోసా వేయనుంది. ఆ తర్వాత నుంచి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు సూచించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. దానికి అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని హస్తం నేతలు చెబుతున్నారు.
ఇక పార్టీలో చేరికల విషయానికస్తే. కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నమాట. పాత, కొత్త నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీకి ఇబ్బందులు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై కేసీ.. రాష్ట్ర నేతలకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు కొందరు పార్టీ లైన్‌కి భిన్నమైన స్టేట్‌మెంట్స్ ఇస్తున్నట్లు కాంగ్రెస్‌లో ఇన్నర్ టాక్ నడుస్తోంది. దానివల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నట్లు పార్టీ పెద్దలు గుర్తించారట. ఈ అంశంలో కూడా కేసీ వేణుగోపాల్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. పార్టీ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడం లాంటి విషయాల్లో కూడా కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకుంటారట.
మొత్తం మీద కాంగ్రెస్ పీఏసీ సమావేశానికి కేసి వేణుగోపాల్ హాజరు కావడంపై సర్వత్ర ఆసక్తి నెలకుంది. మరి చూడాలి ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది.
YCP Leaders: వెంటాడుతున్న కేసులు.. వైసీపీ నేతలకు పెద్ద సవాల్