Train Accident: కేరళలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి
కేరళ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కేరళ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని

Train Accident
Train Accident In Kerala : కేరళ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కేరళ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. మృతిచెందిన వారు పారిశుద్ధ్య పనులకోసం రైల్వేలో కాంట్రాక్టు ప్రాతిపదికన కార్మికులుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే, వీరిలో ముగ్గురి మృతదేహాలు లభ్యంకాగా.. మరో మృతదేహం కనిపించకుండా పోయింది. సమీపంలోని భరతపూజ నదిలో పడిపోయినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
మృతులు తమిళనాడుకు చెందిన లక్ష్మణన్, వల్లి, రాణిలుగా గుర్తించారు. షోరనూర్ బ్రిడ్జి సమీపంలో ట్రాక్ పై చెత్తను తొలగిస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో మృతదేహంకోసం రైల్వే సిబ్బంది గాలిస్తున్నారు. తాజా ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.