లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 01:14 PM IST
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం

Updated On : February 5, 2020 / 1:14 PM IST

లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరిగింది…ఆపాలంటున్నారని చెప్పారు. ఈ పథకాల్లో అవినీతి జరగలేదని కేంద్రమే సమాధానం ఇచ్చింది.

పేద ప్రజల పొట్టకొట్టేలా బీజేపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెకక్టు నిధుల కోసం పోరాడాలని అన్నారు. ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ కు ఉందనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ కవిత పోరాట ఫలితమే నిజామాబాద్ లో స్పైస్ బోర్డు మంజూరు అని తెలిపారు. 

అవినీతి రహిత పాలనను తెలంగాణ కోరుకుంటోందని ఎంపీ కేకే అన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అనినీతి లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకే ఆధార్ అనుసంధానం అన్నారు. 

స్పైస్ బోర్డును స్వాగతిస్తున్నామని..నిజామాబాద్ కే రావాలని కోరుకున్నామని తెలిపారు. వరంగల్ లో ఉన్న స్పైస్ బోర్డును మార్చొద్దన్నారు. 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులపై త్వరలో నిర్ణయం చెబుతామని తెలిపారు.