ట్రంప్ చర్యలతో చెదురుతున్న డాలర్ డ్రీమ్స్ : ఆందోళనలో భారతీయులు
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నరక్షణాత్మక చర్యల వల్ల భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి.

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నరక్షణాత్మక చర్యల వల్ల భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి.
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నరక్షణాత్మక చర్యల వల్ల భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల వీసా గడువు పొడిగించాలని చేసుకుంటున్న దరఖాస్తులను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. లేదంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్‌ఎఫ్‌ఈ)లను సమర్పించాల్సిందిగా అధికారులు పదేపదే అడుగుతున్నారు.
ఆర్ఎఫ్ఈలు ఇచ్చినా వీసా గడువు పొడిగిస్తారనే గ్యారంటీ ఏమీలేదు. వీసాలు రిజెక్టవుతున్నప్పటికీ చాలామంది టెక్కీలు స్వదేశానికి తిరిగి రాకుండా అమెరికాలోనే పనిచేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. స్వదేశానికి తిరిగివచ్చి అదే కంపెనీలో పనిచేయాలన్నా, కొత్త కంపెనీకి మారాలన్నా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు టెక్కీలు. గడచిన దశాబ్ద కాలంలో (2007-17) అమెరికా 34 లక్షలమందికి హెచ్1బీ వీసాలు కేటాయించగా, వీరిలో 22 లక్షల మంది భారతీయులున్నారు.
Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్టలు – వర్మ సెటైర్లు
అమెరికా ప్రభుత్వం అడిగే “రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ “లో అనుమతులు రావటం కూడా చాలా కష్టం. ఆర్ఎఫ్ఐ ప్రక్రియలో భాగంగా 21 చెక్ లిస్టులను పూర్తిచేయాల్సి ఉంటుంది. అలాగే రాబోయే రెండున్నరేళ్ల కాలానికి సంబంధించిన పని వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటోందని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తెలిపాడు. అమెరికన్లకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వీసా విధానంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల అమెరికాలో ఆందోళనకర పరిస్ధితులు నెలకొన్నాయని ఇమ్మిగ్రేషన్ కేసులు వాదించే ఒకసంస్ధ యజమాని చెప్పారు.
గతేడాది 30 సాఫ్ట్ వేర్ కంపెనీలకు సంబంధించి 13,177 మంది హెచ్1బీ వీసాలు పొడిగింపుకు దరఖాస్తు చేసుకోగా వారిలో 8,742 దరఖాస్తులను ట్రంప్ ప్రభుత్వం తిరిస్కరించింది. అమెరికాలో మూడేళ్ల కాలానికి జారీచేసే హెచ్1బీ వీసాను మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చని ‘సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్’ చెప్పింది. హెచ్1బీ వీసా గడువు ముగిసే సమయంలో చాలామంది భారతీయులు అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డును పొందేందుకు భారతీయ ఐటీ నిపుణులకు కనీసం పదేళ్లు పడుతోందని ‘సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్” తెలిపింది.
Read Also : పేమెంట్ పెంచగానే రెచ్చిపోతే ఎలా : పవన్ పై విజయసాయి సెటైర్లు