మాయాజాల వ్యాయామాలు పెంచండి మోడీ గారు

  • Published By: venkaiahnaidu ,Published On : February 2, 2020 / 03:52 PM IST
మాయాజాల వ్యాయామాలు పెంచండి మోడీ గారు

Updated On : February 2, 2020 / 3:52 PM IST

శనివారం(ఫిబ్రవరి-1,2020)దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్‌తో తెలిసిపోయిందని శనివారం బడ్జెట్ ప్రసంగం అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే.

అయితే ఇవాళ(ఫిబ్రవరి-2,2020)మోడీ గతంలో విడుదల చేసిన ఓ వీడియోను జత చేస్తూ ఇచ్చిన ట్వీట్‌లో మోడీకి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేయాలని మోడీకి రాహుల్ గాంధీ సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం చేసిన ట్వీట్‌లో క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మోదీ రోజువారీ యోగాభ్యాసాన్ని పెంచితే బాగుంటుందేమో చూడాలన్నారు.
 
ప్రియతమ ప్రధాన మంత్రి గారూ, దయచేసి మీ రోజువారీ మాయాజాల వ్యాయామాలు (మ్యాజికల్ ఎక్సర్‌సైజెస్‌)ను మరి కాస్త పెంచండి. మీకు తెలియదు, అవి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచవచ్చని రాహుల్ ట్వీట్ లో తెలిపారు.