CAA గురించి మాట్లాడిన ప్యాసింజర్‌ను పోలీసులకు పట్టించాడని Uber డ్రైవర్‌ సస్పెండ్

CAA గురించి మాట్లాడిన ప్యాసింజర్‌ను పోలీసులకు పట్టించాడని Uber డ్రైవర్‌ సస్పెండ్

Updated On : February 9, 2020 / 4:45 AM IST

ఉత్సాహం చూపించిన క్యాబ్ డ్రైవర్ చేసిన పని ఇది. కారెక్కి సీఏఏపై చర్చించాడని దేశానికి ఏదో ముప్పు వచ్చేస్తుందని భయపడి ప్రయాణికుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీనిపై స్వచ్ఛందంగా స్పందించిన Uber.. ఆ డ్రైవర్‌ను తాత్కాలికంగా విధుల నుంచి నిలిపివేస్తూ.. అతనిపై ఎంక్వైరీ వేసినట్లు తెలిపింది. 

‘మీ సేఫ్టీయే మాకు ముఖ్యం. ఇలా జరిగిన దాని కారణంగా మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ డ్రైవర్ ను తాత్కాలికంగా డ్యూటీ నుంచి నిషేదించాం. అతనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది’ అని యూబర్ ప్రతినిధి ప్రయాణికుడికి తెలిపారు. 

అసలేం జరిగింది:
బుధవారం జరిగిన బుకింగ్ ప్రకారం.. క్యాబ్ డ్రైవర్ రోహిత్ సింగ్.. బప్పతీయ సర్కార్ అనే వ్యక్తిని జుహూ సిల్వర్ బీచ్ దగ్గర పిక్ అప్ చేసుకుని కుర్లా అనే ప్రాంతంలో దింపాల్సి ఉంది. కారెక్కిన తర్వాత జైపూర్‌లోని ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు. దేశంలో పౌరసత్వ చట్టంపై జరుగుతున్న ఆందోళనల గురించి చర్చించుకున్నారు. అవన్నీ ఆ డ్రైవర్‌కు నచ్చలేదు. 

సంభాషణ పూర్తి అయ్యే సమయానికి సర్కార్‌ను శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు సర్కార్. కారు ఆపి తాను ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లతో వచ్చాడు. అప్పుడు తెలిసిందట సర్కార్‌కు తాను పోలీస్ స్టేషన్‌కు వచ్చానని. 

దేశంలోని పలు నగరాల్లో జరుగుతున్న ఆందోళనల గురించి నా స్నేహితుడితో చర్చిస్తున్నాను. షహీన్ బాగ్ లో నిన్న ఏం జరిగిందనే దానిపై మాట్లాడుకుంటున్నాం. ప్రజలు లాల్ సలాంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని అనుకున్నాం. కావాలంటే నా ఫోన్ రికార్డింగ్‌లు చెక్ చేసుకోండి. ఏదైనా తప్పుగా అనిపిస్తే యాక్షన్ తీసుకొమ్మని చెప్పాడట. 

డ్రైవర్ మాటల్లో.. ‘ఈయన దేశాన్ని నాశనం చేయాలని మాట్లాడుతున్నాడు. నేను కమ్యూనిస్టుని. దేశం మొత్తాన్ని షహీన్ బాగ్ లా తయారుచేస్తామంటున్నాడు. నా దగ్గర పూర్తి రికార్డింగ్ ఉంది’ అని పోలీసులకు చెప్పాడు. ఇంకా ప్యాసింజర్ తనను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చావని అడిగిన ప్రశ్నకు.. ‘నువ్వు దేశాన్ని పాడుచేస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా.. నిన్ను ఇంకా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినందుకు సంతోషించు. వేరే ఎక్కడికి తీసుకెళ్లినా వేరేలా ఉండేది’ అని అన్నాడట. 

ఆ ప్యాసింజర్ స్వతహాగా కవి. పోలీసులు అతణ్నిరెండు గంటలపాటు ప్రశ్నించారట. రీసెంట్ గా రాసిన కవిత గురించి. కమ్యూనిజంపై అతని ఉద్దేశ్యాలు గురించి. ముంబై బాగ్, షహీన్ బాగ్ ఆందోళనల గురించి విచారణ జరిపారు. ఆ తర్వాత అర్ధరాత్రి 1గంట 30నిమిషాల సమయంలో స్టేషన్ నుంచి వదిలేశారు. అంతకంటే కాస్త సమయం ముందు వరకూ క్యాబ్ డ్రైవర్ కూడా స్టేషన్ లోనే ఉన్నాడు. 

దీంతో రెండో రోజు ముంబై బాగ్ వెళ్దామనుకున్న సర్కార్.. క్యాబ్ బుక్ చేసుకోవడం మానేసి రైలు ఎక్కి గమ్యానికి చేరుకున్నాడట.