దళపతి విజయ్‌కు పోటీగా స్టాలిన్ తనయుడు!
తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

Udhayanidhi Stalin competition with Dalapati Vijay
Tamilnadu Politics : తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ద్రవిడ రాజకీయంలో యువ తరం తళుక్కుమంటోంది. సంప్రదాయ ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలకు పోటీగా సినీ నటుడు, దళపతి విజయ్ కొత్త పార్టీ ప్రారంభించగా, ఆయన నుంచి ఎదురయ్యే సవాల్‌ను అధిగమించేందుకు డీఎంకే మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఉదయనిధిని ఇప్పుడే డీసీఎం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు?
దక్షిణ భారత్‌లో కీలకమైన తమిళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. ఐనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేని ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ప్రముఖ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేశారు. యువతలో ఆయనకు క్రేజ్ ఉండటంతో.. డీఎంకే అప్రమత్తమైంది. మంత్రి, యువనేత, సీఎం స్టాలిన్ వారసుడు ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా చేసి విజయ్‌కు చెక్ చెప్పాలని భావిస్తోంది.
Indus Water Treaty : దాయాది పాక్‌కు భారత్ అల్టీమేటం.. సింధూ నదీ జలాల ఒప్పందంపై నోటీసులు..!
మంత్రి ఉదయనిధి కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఆయనకూ యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. ఇక ముఖ్యమంత్రి స్టాలిన్‌కు 70 ఏళ్ల వయసు పైబడటంతో ఆయన వారసుడిగా ఉదయనిధి పేరు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఐతే డీఎంకేలో చాలా మంది సీనియర్లు ఉండటంతో.. ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేస్తే ఎక్కడ పార్టీలో వ్యతిరేకత వస్తుందోనని ఇన్నాళ్లు ఎదురుచూశారు. ఇదే సమయంలో జిల్లాస్థాయిలో ఉదయనిధి నాయకత్వం కోరుకుంటూ తీర్మానాలు చేయించారు. దీంతో పార్టీలో అన్నివర్గాల నుంచి ఉదయనిధికి మద్దతు లభించినట్లైంది.
దీంతో డీఎంకే భావనేతగా ఉదయనిధి స్టాలిన్‌ను ప్రమోట్ చేస్తూ ముందుగా డిప్యూటీ సీఎం చేస్తారంటున్నారు. ఆగస్టులోనే ఈ తతంగం పూర్తి చేయాల్సివున్నా, ఎందుకో ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ సమయం వచ్చిందని, నేడో రేపో ఉదయనిధి తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ సస్పెన్స్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడు తెరదించుతారనేదే ఆసక్తి కలిగిస్తోంది.