2నెలలు ఆలస్యంగా…సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం!

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 08:01 AM IST
2నెలలు ఆలస్యంగా…సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం!

Updated On : April 28, 2020 / 8:01 AM IST

కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్ నుంచి మొదలయ్యే అవకాశం సృష్టంగా ఉంది. కాలేజీలు,యూనివర్శిటీల్లో వచ్చే విద్యాసంవత్సరాన్ని(academic year)ను.. సంప్రదాయ “జులై మధ్య” నుంచి కాకుండా సెప్టెంబర్ కు మార్చాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నియమించిన ఓ ప్యానెల్ సిఫారసు చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా నష్టం మరియు ఆన్‌లైన్ విద్య సమస్యలను పరిశీలించడానికి UGC రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. హర్యానా యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ R.C.కుహద్ నేతృత్వంలో ఒక కమిటీ,ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU)వైస్ ఛాన్సలర్ నాగేశ్వర్ రావు నేతృత్వంలో మరో కమిటీని UGC నియమించింది. లాక్ డౌన్ మధ్య యూనివర్శిటీల్లో పరీక్షలు నిర్వహించే మార్గాలను పరిశీలించడానికి మరియు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ పై పని చేయడానికి కుహాద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయగా, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు సూచించేందుకు నాగేశ్వర్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

 

అయితే శుక్రవారం రెండు కమిటీలు తమ రిపోర్ట్ లను సమర్పించాయి. విద్యాసంవత్సరం(academic year) జూలైకి బదులుగా సెప్టెంబర్ నుండి ప్రారంభించాలని ఒక కమిటీ సిఫారసు చేసింది. మౌలిక సదుపాయాలు మరియు మార్గాలు ఉంటే కనుక యూనివర్శిటీలు ఆన్ లైన్ ఎగ్జామ్ లను నిర్వహించాలని లేదా లాక్ డౌన్ ముగిసే వరకు వేచి ఉండి ఆపై పరీక్షలకు తేదీలను నిర్ణయించాలని రెండోవ కమిటీ సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ రెండు రిపోర్టులు ఇప్పుడు స్టడీ చేయబడతాయి మరియు దీనికి సంబంధించి అధికారిక మార్గదర్శకాలను వచ్చే వారం నాటికి తెలియజేయవచ్చు. అన్ని సిఫార్సులు అంగీకరించబడతాయనే నిబంధన ఏమీ లేదు. సాధ్యాసాధ్యాల సమస్యలపై చర్చించి పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న తర్వాత మార్గదర్శకాలు జారీ చేయబడతాయి అని ఒక అధికారి తెలిపారు.

 

అకడమిక్ సెషన్ ప్రారంభించడంలో మరో అడ్డంకి… ప్రవేశ పరీక్షలు(entrance examinations)నిర్వహణ, అదేవిధంగా పెండింగ్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించడంలో ఆలస్యం అని కమిటీ ఎత్తి చూపింది. ఇప్పటివరకు ఉన్న ప్లాన్ ఏంటంటే..NEET,JEE వంటి ప్రవేశ పరీక్షలను జూన్ లో నిర్వహించాలని. అయితే కరోనా పరిస్థితిని సమీక్షిస్తూ ఉండటం చాలా అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు,కాలేజీలు,యూనివర్శిటీలు మార్చి-16,2020నుంచి మూతపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి-24న దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడం,ఇటీవల మళ్లీ లాక్ డౌన్ ను మే 3  వరకు పొడించడం తెలిసిన విషయమే. కాగా, ప్రమోషన్ మరియు అండర్ గ్యాడ్యుయేట్ అడ్మిషన్స్ కు అతిముఖ్యమైన 29సబ్జెక్టులకు మాత్రమే పెండింగ్ బోర్డు ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు సెంట్రలో బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.