Union Cabinet Meet: సంవత్సర కాలం తర్వాత ఫిజికల్‌గా కేంద్ర కేబినెట్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఏడాది కాలం తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ సమావేశం ఉదయం 11గంటలకు ఆరంభం కానుంది.

Union Cabinet Meet: సంవత్సర కాలం తర్వాత ఫిజికల్‌గా కేంద్ర కేబినెట్ భేటీ

Union Acbinet

Updated On : July 14, 2021 / 7:53 AM IST

Union Cabinet Meet: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఏడాది కాలం తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ సమావేశం ఉదయం 11గంటలకు ఆరంభం కానుంది. గతేడాది ఏప్రిల్ మొదటి వారంలో మాత్రమే ఫిజికల్‌గా భేటీ అయ్యారు. ఆ సమయంలోనే కరోనా మహమ్మారి దేశాన్ని స్తంభింపజేసింది.

కాకపోతే అప్పటి నుంచి కేంద్ర కేబినెట్ ప్రతివారం వీడియో కాన్ఫెరెన్సింగ్ ద్వారా మీట్ అవుతూనే ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ సమావేశాలు కొనసాగించారు.

దీంతో పాటుగా సాయంత్రం 4గంటల సమయంలో మంత్రి మండలితో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. జులై 7న మంత్రి మండలి విస్తరణ తర్వాత జరుగుతున్న రెండో మీటింగ్ ఇది. 43కొత్త మంత్రులను చేర్చి మొదటి సమావేశాన్ని జులై 8న నిర్వహించారు.

రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశం గురించి ఈ మీటింగ్ లో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకే జరిగిన పలు సమావేశాల్లో చర్చలు జరిపారు.