ప్రచారం ఆపి పరుగులు…సహాయక చర్యల్లో స్మృతీ ఇరానీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 28, 2019 / 01:26 PM IST
ప్రచారం ఆపి పరుగులు…సహాయక చర్యల్లో స్మృతీ ఇరానీ

Updated On : April 28, 2019 / 1:26 PM IST

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019) అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు.అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె అమేథీ పర్యటన సమయంలో పురబ్ ద్వారా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది.వెంటనే అగ్నిప్రమాదం జరిగిన గ్రామానికి స్మృతీ వెళ్లారు.మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చేతి పంపును స్వయంగా కొట్టి బకెట్లలో నీటిని నింపి..నీటితో మంటలార్పేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. అనంతరం ప్రమాదంలో నష్టపోయిన బాధితులను స్మృతి ఇరానీ పరామర్శించారు.వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.