మణిపూర్‌లో ప్రస్తుత హింసకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జేపీ నడ్డా

మణిపూర్ లో ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.

మణిపూర్‌లో ప్రస్తుత హింసకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జేపీ నడ్డా

JP Nadda Mallikarjun Kharge

Updated On : November 22, 2024 / 1:08 PM IST

JP Nadda: మణిపూర్ లో ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. మణిపూర్ హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా జేపీ నడ్డా ఖర్గేకు మూడు పేజీల లేఖను రాశారు. 20ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సమస్యలనుపరిష్కరించడంలో కాంగ్రెస్ ఘోర వైఫల్యంతో మణిపూర్ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. కానీ, మణిపూర్ లో హింస ప్రారంభమైనప్పటి నుండి కేంద్రంలో, మణిపూర్ లోని బీజేపీ ప్రభుత్వాలు పరిస్థితిని నియంత్రించడానికి, ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నాయని లేఖలో జేపీ నడ్డా పేర్కొన్నారు.

Also Read: India vs Canada: భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా.. ఆ కథనాలు అవాస్తవమని వెల్లడి

భారత భద్రతా వైఫల్యానికి, దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని జేపీ నడ్డా ఆరోపించారు. మణిపూర్ లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ పదేపదే ఎలా ప్రయత్నిస్తుందో అందరికి తెలుసని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోకి విదేశీయుల మిలిటెంట్ల అక్రమ వలసలను చట్టబద్ధం చేసిందని, అప్పటి హోంమంత్రి పి. చిదంబరం వారితో ఒప్పందాలపై సంతకాలు చేశారు.. ఖర్గే ఇదంతా మర్చిపోయినట్లున్నారంటూ జేపీ నడ్డా విమర్శించారు.

Also Read: Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. ప‌వ‌న్‌ను ఆలింగన చేసుకున్న బొత్స.. వీడియో వైరల్

మణిపూర్ లో శాంతిని నెలకొల్పితే దానిని ధ్వంసం చేయడానికి చూస్తున్నారని కాంగ్రెస్ నేతలపై జేపీ నడ్డా మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం హయాంలో ఈశాన్య ఆర్థిక వ్యవస్థ, భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య, అభివృద్ధి అవకాశాలను పెంపొందించడంతోపాటు ప్రతిదానిలో అభివృద్ధిని అక్కడి ప్రజలు చూశారని అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల తప్పుడు వాగ్దానాలకు వ్యతిరేకంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల స్థిరత్వంపై విశ్వాసం ఉంచడం ద్వారా ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను పదేపదే ఆమోదించారని నడ్డా అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మణిపూర్ లో జరిగిన హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ప్రసంగించినప్పుడు కాంగ్రెస్ అమర్యాదగా, బాధ్యతారాహిత్యంగాప ప్రవర్తించిందని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అంటూ జేపీ నడ్డా లేఖలో పేర్కొన్నారు. భారతదేశ ప్రగతికి విఘాతం కలిగించాలనుకునే విదేశీ శక్తులను కాంగ్రెస్ నేతలు ప్రోత్సహిస్తున్న తీరు నిజంగా ఆందోళన కలిగిస్తోందని జేపీ నడ్డా లేఖలో పేర్కొన్నారు.