రెస్టారెంట్లు రీ ఓపెన్.. ఒక్కొక్కరి మధ్య తప్పనిసరిగా 6అడుగుల దూరం

  • Published By: Subhan ,Published On : June 7, 2020 / 01:15 PM IST
రెస్టారెంట్లు రీ ఓపెన్.. ఒక్కొక్కరి మధ్య తప్పనిసరిగా 6అడుగుల దూరం

Updated On : June 7, 2020 / 1:15 PM IST

రెస్టారెంట్లు, మాల్స్‌లో ఫుడ్ కోర్టులు రీ ఓపెనింగ్ కు రెడీ అయిపోయాయి. ఆరు అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తూ.. కేవలం 50శాతం సీటింగ్ కెపాసిటీతో నిర్వహించాలనే ఆదేశాలను పాటిస్తూ రెడీ అవుతున్నారు. కొత్తగా ప్రకటించిన గైడ్ లైన్స్ ప్రకారం.. ‘ప్రార్థన స్థలాల్లో ప్రేయర్ కోసం కామన్ మ్యాట్లు వాడకూడదు. ప్రసాదం, హోలీ వాటర్ పంచుకోవడం వంటివి నిషేదించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వయస్సు, ఆరోగ్యపరమైన నిషేదాలు అడ్డుపడుతున్నాయి. 

తప్పనిసరిగా మాస్క్‌లు, ఆరోగ్యసేతు యాప్ అందరి దగ్గర ఉండాల్సిందే. ఇవన్నీ పాటిస్తూ.. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నుంచి మాల్స్, ప్రార్థనా మందిరాలు, ఆఫీసులు, రెస్టారెంట్లు, హోటళ్లు జూన్ 8నుంచి ఓపెన్ చేయాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే. దీంతో పాటు కంటైన్మెంట్ జోన్లలో మెడికల్, నిత్యవసర వస్తువులు తప్పించి మిగిలిన షాపులన్నీ మూసే ఉంచుతారు. 

మాస్క్ లు, థర్మల్ స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ వంటి అంశాలు కచ్చితంగా పాటించాల్సిందే. 65ఏళ్లు పైబడ్డ వారు, కొమొబిడిటీస్, గర్భిణీలు, పదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు ఇళ్లలో ఉండడమే బెటర్. రెస్టారెంట్లలో కూడా వీలైనంత వరకూ ఎప్పుడూ మాస్క్ లు పెట్టుకునే ఉండాలి. 

ఒకటి లేదా రెండు కరోనా కేసులు నమోదైతే ఆఫీసు మూసి ఉంచాల్సిన పనిలేదు. ఆ ప్రాంతం వరకూ డిస్‌ఇన్ఫెక్షన్ చేసి దూరంగా ఉండాలి. అంతేకానీ బిల్డింగ్ మొత్తం మూసేసి ఆఫీస్ కు ఆటంకం కలిగించాల్సిన పనిలేదు. నిర్ణీత సమయం తర్వాత ఆ ప్రదేశాన్ని యథావిధిగా వాడుకోవచ్చు.