Uttar Pradesh : ఇళ్ల ముందు మిఠాయిలు పడేసి పోయిన వ్యక్తి..అవి తిన్న నలుగురు చిన్నారులు మృతి..

ఇళ్ల ముందు మిఠాయిలు పడేసి పోయిన  వ్యక్తి..అవి తిన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు..

Uttar Pradesh : ఇళ్ల ముందు మిఠాయిలు పడేసి పోయిన వ్యక్తి..అవి తిన్న నలుగురు చిన్నారులు మృతి..

Kushinagar Children Death In Up

Updated On : March 23, 2022 / 12:12 PM IST

Kushinagar children death In UP : చిన్నపిల్లలు మిఠాయిలు, చాక్లెట్లు తినటానికి ఇష్టపడతారు. ఆ ఇష్టమే యూపీలో నలుగురు ప్రాణాలు తీసింది. స్వీట్లు తిన్న నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన యూపీలోని కుషీనగర్​ లఠ్​ఊర్ టోలా పోలీస్​ స్టేషన్ పరిధిలోని సిసయి గ్రామంలో బుధవారం (మార్చి 23,2022)చోటుచేసుకుంది.

సిసయి గ్రామంలో నలుగురు చిన్నారులు మిఠాయిలు తిని ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మృతి చెందిన పిల్లల్లో ముగ్గురు ఒకే కుంటుంబానికి చెందినవారు. చిన్నారుల మృతితో రెండు కుటుంబాల్తో తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

కాగా..ఇంటి గడప ముందు ఎవరో మిఠాయిలు పడేసి పోయారని..వాటిని చూసి తిన్న తర్వాత చిన్నారుల ఆరోగ్యం విషమంగా మారిందని దీంతో వెంటనే పిల్లలను జిల్లా ఆసుప్రతికి తరలించామని..చికిత్స పొందుతు చనిపోయారని పిల్లల తండ్రి కన్నీటితో తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా షెడ్యూల్డ్ తెగ (ST)కు చెందినవారు కావడం గమానార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.