Rahul Gandhi : అమిత్ షాపై వ్యాఖ్యలు.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
2018లో కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi
Rahul Gandhi Case : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్ గాంధీకి యూపీ సుల్తాన్పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో కోర్టు మంగళవారం రాహుల్ సరెండర్ అయ్యారు. 45 నిమిషాల కస్టడీ తరువాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018లో అమిత్ షాపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్ పూర్ కోర్టును ఆశ్రయించారు.
Also Read : PM Modi : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.. మోదీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుంది
2018లో కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలను నమ్ముతుందని చెప్పుకుంటున్నదని, అయితే, హత్య కేసులో నిందితుడు గా ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అమిత్ షా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ అదే ఏడాది ఆగస్టు 4న కోర్టును విజయ్ మిశ్రా ఆశ్రయించాడు. దీంతో ఇవాళ ట్రయల్ కోర్టు ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అమిత్ షాకు పరువు నష్టం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.