Viral Pic : ఐఏఎస్ అధికారితో కూరగాయలు అమ్మించిన మహిళ
ఓ మహిళ ఓ ఐఏఎస్ అధికారితో నడిరోడ్డుమీద కూర్చోబెట్టి కూరగాయలు అమ్మించింది.దీనికి సంబందించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Up Ias Officer Sells Vegetables (1)
up ias officer sells vegetables : నడిరోడ్డుమీద కూర్చుని ఓ ఐఏఎస్ అధికారి కూరగాయాలు అమ్ముతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటో ఏదో మార్ఫింగ్ చేసింది కాదు.నిజంగానే ఆయన కూరగాయలు అమ్మారు. ఎందుకు అంటే ..కరోనా కష్టం మాత్రం కాదండోయ్..కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్న ఓ మహిళ కోసం ఆయన కూరగాయలు అమ్మారు. అదేం చిత్రమో గానీ ఆయన కూరగాయాలు కొట్టులో కూర్చున్నాక కష్టమర్లు కూడా భలే వచ్చారు. దీంతో రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు.స్వయంగా ఆయనే ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన్ని రోడ్డుమీద కూర్చోపెట్టి కూరగాయలు అమ్మించిన వైనం ఏంటంటే..
అఖిలేష్ మిశ్రా. ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి. యూపీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఫోటో వైరల్ కావటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తు ఇది నిజమా? లేక ఫేకా? అని కామెంట్లు చేశారు. దీంతో స్వయంగా ఆయనే ఆ ఫోటోలో ఉన్నది నేనే అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఆ ఫోటోలో ఉన్నది తానేనని.. అక్కడ కూరగాయలు అమ్మింది కూడా నిజమేనని తెలిపారాయన. ఈ వివరాలేంటో ఆయన మాటల్లోనే..‘‘నేను ఆఫీసు పని మీద ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాను. అక్కడ మార్కెట్‌లో ఆగి కూరగాయలు కొన్నాను. కూరగాయలు అమ్మే ఓ మహిళ నా వద్దకొచ్చి..కాసేపు తన కూరగాయల బండి దగ్గర కూర్చోవాలని అడిగింది. దీంతో నేను కాసేపు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆమె అడిగినదానికి కాదనలేకపోయాను.. కాసేపు అక్కడ కూర్చున్నాను. అదే సమయంలో కస్టమర్లు రావడంతో.. వాళ్లకు కూరగాయలు అమ్మాను. అని తెలిపారు.ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో చెప్పుకొచ్చారు ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా.