చంటిబిడ్డను ఒడిలో పెట్టుకుని డ్యూటీ చేస్తున్న IAS అధికారిణి

  • Published By: nagamani ,Published On : October 13, 2020 / 12:12 PM IST
చంటిబిడ్డను ఒడిలో పెట్టుకుని డ్యూటీ చేస్తున్న IAS అధికారిణి

Updated On : October 13, 2020 / 12:40 PM IST

up ias officer : రోజుల పసిబిడ్డను ఎత్తుకుని డ్యూటీకి వచ్చిన ఓ ఐఏఎస్ అధికారిణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాన్పు తరువాత ఆరు నెలల పాటు సెలవులు ఉన్నాసరే..ఉద్యోగ బాధ్యతే ముఖ్యమనికుని పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని డ్యూటీ చేస్తున్న ఆ ఐఎస్ఎస్ అధికారిణి ‘‘సౌమ్యాపాండే’’.



ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. బాలింతగా ఉండి కూడా పసిబిడ్డను చంకనేసుకుని ప్రతీ రోజు డ్యూటీకి వస్తున్నారు సౌమ్యాపాండే. పాప బాధ్యతతో పాటు డ్యూటీ కూడా ముఖ్యమేనంటున్న సౌమ్యా పాండే అంకిత భావానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఉద్యోగం చేసే మహిళలకు ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి బాధ్యతలు చాలా ఉంటాయి. భార్యగా..తల్లిగా..కోడలిగా..కూతురిగా ఇలా ఎన్నో బాధ్యతల్ని ఎంతో ఓర్పుగా..నేర్పుగా నిర్వహించే సత్తా మహిళల సొంతం అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. దానికి ప్రత్యక్ష నిదర్శనం యూపీ ఐఏఎస్ అధికారిణి సౌమ్యా పాండే.


ప్రయాగ్ రాజ్ కు చెందిన సౌమ్యా పాండే…2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. సరిగ్గా 23 రోజుల క్రితం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవంత తరువాత ఆమెకు ఆరు నెలల వరకూ సెలవు ఉంటుంది. కానీ.. కరోనా సమయంలో తన బాధ్యతలను మరింత అవసరమనుకున్నారామె. దీంతో తన బిడ్డ బాధ్యతలతో పాటు డ్యూటీకూడా ముఖ్యమననే ఉద్ధేశ్యంతో సౌమ్యా రోజుల చంటిబిడ్డను తీసుకుని డ్యూటీలో జాయిన్ అయిపోయారు.


ఒళ్లో బిడ్డను పెట్టుకుని తన విధులను నిర్వహిస్తున్న సౌమ్యాపాండే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌమ్యా పాండే, యూపీలోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. కాన్పు తరువాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తుండటాన్ని పలువురు అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.