UP polls: మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు.. రేపే పోలింగ్!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది.

UP polls: మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు.. రేపే పోలింగ్!

Poll

Updated On : February 13, 2022 / 9:00 AM IST

UP polls: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఇప్పుడు మూడో విడత ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు ముగియగా.. రెండో దశలో 9 జిల్లాల్లోని 55 స్థానాల్లో పోలింగ్‌ జరగబోతుంది.

ఈ క్రమంలోనే సహరాన్‌పూర్‌, బిజ్నోర్‌, మొరాదాబాద్‌, సంభాల్‌, రాంపూర్‌, బరేలీ, అమ్రోహా, షాజహాన్‌పూర్‌, బదౌన్‌లలో రాజకీయ పార్టీల పెద్ద నాయకులు, స్టార్‌ క్యాంపెయినర్లు మీటింగ్‌లు నిర్వహించి తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు. రేపు అనగా ఫిబ్రవరి 14న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.

రెండో విడతలో తమ అభ్యర్థులకు హవాను కల్పించేందుకు అధికార బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు శాయశక్తులా ప్రయత్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా పెద్ద నాయకులందరూ జిల్లాల్లో రెండో విడత ఎన్నికల కోసం బహిరంగ సభలు నిర్వహించి తమ అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు.

అంతేకాదు.. రేపు ఉత్తరాఖండ్, గోవాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఉత్తరాఖండ్ లో 70, గోవాలో 40 స్థానాలకు పోలింగ్ జరగబోతుంది.