రాహుల్ “రేప్ ఇన్ ఇండియా” వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2019 / 06:33 AM IST
రాహుల్ “రేప్ ఇన్ ఇండియా” వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్

Updated On : December 13, 2019 / 6:33 AM IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలతో ఇవాళ లోక్ సభలో దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదటిసారిగా ఓ నాయకుడు గట్టిగా పిలుపునిచ్చాడని,ఇదేనా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చే మెసేజ్ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. రాహుల్ క్షమాపణలకు బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

అయితే రాహుల్ వ్యాఖ్యలను డీఎంకే,కాంగ్రెస్ సమర్థించాయి. రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని డీఎంకే ఎంపీ కనిమోళి తెలిపారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా అని చెప్పారని,దాన్ని మేము గౌరవించామని,అయితే ఇప్పుడు దేశంలో జరగుతున్నది ఏంటీ అని కనిమోళి ప్రశ్నించారు. అదే రాహుల్ చెప్పాలనుకున్నాడని అన్నారు.

దురదృష్టవశాత్తూ మేక్ ఇన్ ఇండియా జరగడం లేదని, దేశంలోని మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయని ఆమె అన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని కనిమోళి అన్నారు. అయితే సభలో అధికార,విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో సభను 12వరకు వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు రాజ్యసభలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజ్యసభను కూడా స్పీకర్ వాయిదా వేశారు.

గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ…నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు.కానీ ఇప్పుడు మీరు ఎక్కడ చూసిన రేప్ ఇన్ ఇండియా కనిపిస్తోంది.ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళపై అత్యాచారం చేశాడు.ప్రధాని మోడీ దీనిపై మాట కూడా మాట్లాడలేదని రాహుల్ అన్న విషయం తెలిసిందే.