వామ్మో ఇదేం డైట్: 46 రోజులుగా బీరే ఆహారం

బరువు తగ్గాలంటే తక్కువ తినాలి.. రోజూ పొద్దున్నే వ్యాయామం చేయాలి. కొవ్వు పదార్థాలను అతిగా తినకూడదని ఇంకా ఇలాంటి చిట్కాలు ఎన్నో చెబుతుంటారు. కానీ, అమెరికాకు చెందిన 43 ఏళ్ల ‘డెల్ హాల్’ 46 రోజులపాటు వేరే ఆహారం ముట్టుకోకుండా రోజుకు 5 బీర్లు తాగేవాడు. బీరు మాత్రమే తాగుతూ 20 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుమారు 1600 ఏళ్ల కిందట సన్యాసులు ఈ డైట్ పాటించేవారు.
బీరులో ఉండే సుగర్ కంటెంట్ వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. అయితే, డెల్ హాల్ బీరు మాత్రమే తాగుతూ బరువు తగ్గడం ఆశ్చర్యకరం. డెల్ హాల్ ఓ బీరు తయారీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.