మోడీ కోసం… UNSG సమ్మిట్ కు ట్రంప్ సడన్ విజిట్

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2019 / 04:19 PM IST
మోడీ కోసం… UNSG సమ్మిట్ కు ట్రంప్ సడన్ విజిట్

Updated On : September 23, 2019 / 4:19 PM IST

ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని వాతావరణ మార్పు అంశంపై ప్రసంగించారు. అయితే ఈ సదస్సుకి ఊహించని విధంగా వచ్చి అందరినీ ఆశ్చర్చపరిచారు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సుమారు 15 నిమిషాలపాటు అక్కడ ఉన్నాడు.  శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడకపోయినప్పటికీ… పిఎం మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సందేశాలను విని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

రత్ లో మిలియన్ల కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాస్ కనెక్షన్లను తాము అందించామని ప్రధాని మోడీ తెలిపారు. నీటి వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ,వర్షపు నీటి సేకరణ కోసం ‘జల్ జీవన్’ మిషన్ ప్రారంభించామన్నారు. ఈ ఏడాది భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా… సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి స్వేచ్ఛ పొందాలని ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు. ఇది ప్రపంచ స్థాయిలో సింగిల్ యూజ్ వాడకం ప్లాస్టిక్‌ వాడకానికి వ్యతిరేకంగా అవగాహన పెంచుతుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. మాట్లాడే సమయం ముగిసిందని…ప్రపంచం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. ఒక టన్ను ఉపదేశాలకంటే ఒక ఔన్స్ ప్రాక్టీస్ విలువైనదని తాము నమ్ముతామని భారత నరేంద్రమోడీ అన్నారు.