Road Accident : యూపీలో బస్సు బోలెరో ఢీ.. ఆరుగురు మృతి..మరో 10మంది పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బొలెరో యూపీ రోడ్‌వేస్‌కు చెందిన కాంట్రాక్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

Road Accident : యూపీలో బస్సు బోలెరో ఢీ.. ఆరుగురు మృతి..మరో 10మంది పరిస్థితి విషమం

Road Accident In Up

Updated On : April 19, 2022 / 12:12 PM IST

Road Accident in UP : ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బొలెరో యూపీ రోడ్‌వేస్‌కు చెందిన కాంట్రాక్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రెండు వాహనాలు బోల్తా పడటంతో చాలా మంది వాహనాల్లో చిక్కుకుపోవటంతో వారిని అతి కష్టంమీద వెలుపలికి తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. డిఐజి, డిఎంతో సహా పలువురు అధికారులు ఆసుపత్రిని పరిశీలించారు.

ఖుషీనగర్‌లోని కోహ్రా గ్రామాని చెందిన ప్రయాణికలు బోలెరో తిలక్ కార్యక్రమానికి హాజరైన తర్వాత డియోరియాకు తిరిగి వస్తుండగా డియోరియాలోని గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనాహా గ్రామ సమీపంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు గోరఖ్‌పూర్ నుంచి ప్రయాణికులను తీసుకువస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా యంత్రాంగం గ్యాస్ కట్టర్ యంత్రాల సహాయంతో బొలెరో బస్సును కట్ చేసి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు.

మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.