Uttar Pradesh: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం..

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి ఉర్దా బాపునగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.

Uttar Pradesh: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం..

Uttar Pradesh

Updated On : June 15, 2023 / 8:15 AM IST

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకోవటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపుచేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఇంట్లో అగ్నిప్రమాదం ఎలాజరిగిందన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం.. అర్థరాత్రి లఖిత అనే విద్యార్థిని మృతి

రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్దా బాపునగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఇంట్లోనుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు వేగంగా ఇంటి చుట్టూ వ్యాప్తిచెందడంతో ఇట్లోని వారు బయటకు రాలేకపోయారు. ఫలితంగా మంటల్లోనే వారు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఒక మహిళ, ఐదుగురు పిల్లలు ఉన్నారు.

Manipur Minister Residence Burned: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ..మంత్రి ఇల్లు దహనం

పోలీసులు మృతదేహాలను సేకరించి మార్చరీకి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అయితే, ఇంట్లోకి మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై స్పష్టమైన సమాచారం వెల్లడి కాలేదు.