పైకి స్పా.. లోన బాలికలతో పాడుపని.. పోలీసుల ఎంట్రీతో బాగోతం బట్టబయలు

police busted prostitution racket: పైకి స్పా.. లోన మాత్రం వ్యభిచారం.. పోలీసుల ఎంట్రీతో బాగోతం బట్టబయలైంది. స్పా మాటున వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టును ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం(ఫిబ్రవరి 4,2021) రట్టు చేశారు. నోయిడా సెక్టార్ 18లోని స్పాలో బాలికలతో వ్యభిచారం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగని పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దీంతో వ్యభిచారం ముఠా గుట్టు రట్టయ్యింది.
వ్యభిచార కూపం నుంచి 14మంది బాలికలను పోలీసులు కాపాడారు. స్పా యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాధిత బాలికలను పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే భవన యజమానికి సైతం పోలీసులు నోటీసులు పంపారు.