తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన యోగి..చితికి నిప్పుపెట్టిన పెద్దన్న

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 03:40 PM IST
తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన యోగి..చితికి నిప్పుపెట్టిన పెద్దన్న

Updated On : April 21, 2020 / 3:40 PM IST

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. లక్నోలోని తన కార్యాలయంలోనే తండ్రికి అంతిమ నివాళులర్పించారు. లక్నోలో ఉన్న యోగి లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని నిర్ణయించుకున్నారు. అందుకే తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని, కడచూపునకు నోచుకోలేకపోయానని ఆవేదనగా చెప్పారు.

ఉత్తరాఖండ్‌లోని పౌడీకి సమీపంలోని పైర్తుక్ గ్రామంలో ఆనంద్ సింగ్ అంత్యక్రియలు జరిగాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తండ్రి అంత్యక్రియలకు యోగి హాజరుకాలేకపోయారు. దీంతో యోగి పెద్దన్నయ్య మనేంద్ర తండ్రి చితికి నిప్పంటించారు. ఆగస్టు-8,1948న జన్మంచిన ఆనంద్ సింగ్ బిస్త్ కు నలుగురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఆనంద్ బిస్త్ కు రెండవ కుమారుడు. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్.

ఆనంద్ సింగ్ భౌతికకాయానికి అంతిమ నివాళులర్పించేందుకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు హాజరయ్యారు. తండ్రిని చివరి క్షణాలలో చూడటానికి వెళ్లాలని భావించాను. కానీ కరోనా వైరస్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రణాళికల రూపకల్పనలో తీరికలేకుండా ఉన్నాను. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలలో పాల్గొనలేను. అంతిమ సంస్కారాల విషయంలో లాక్‌డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నా తల్లి,కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాను అని యోగి సోమవారం ఓ లేఖలో తెలిపారు.