మహారాష్ట్రలో 18-44 ఏళ్లు నిండిన వారికి టీకాడ్రైవ్ నిలిపివేత
మహారాష్ట్రలో 18-44 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల సరఫరా సజావుగా

Vaccine Drive Stoped For 18 44 Year Olds In Maharashtra
Vaccine drive Maharashtra : మహారాష్ట్రలో 18-44 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల సరఫరా సజావుగా లేని కారణంగా వ్యాక్సినేషన్ నిలిపివేసినట్టు స్పష్టం చేశారు.
అలాగే జూన్ నుండి వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తాను ఆశిస్తున్నానని అన్నారు, అప్పుడు రాష్ట్రంలో 24 గంటల టీకా డ్రైవ్ అమలు చేయగలమని వైద్యులతో సమావేశం సందర్భంగా సిఎం థాకరే వ్యాఖ్యానించారు. కాగా టీకా సరఫరా లేకపోవడంతో కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిలిపివేసాయి.
ఇక మహారాష్ట్రలో శనివారం 26,133 తాజా COVID-19 కేసులు మరియు 682 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,53,225 కు చేరింది. అలాగే మరణాల సంఖ్య 87,300 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
గత 24 గంటల్లో 40,294 మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో, మహారాష్ట్ర మొత్తం రికవరీల సంఖ్య 51,11,095 కు పెరిగింది, ప్రస్తుతం 3,52,247 మంది చికిత్స పొందుతున్నారు.. కేసుల రికవరీ రేటు 92.04 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 1.57 కు పెరిగిందని తెలిపింది.