Non-veg food: నాన్ వెజ్ ఫుడ్ దాచి పెట్టి అమ్మండి.. లేదంటే శిక్ష తప్పదు

మాంసాహారంపై కఠిన ఆంక్షలు మొదలుపెట్టింది గుజరాత్ ప్రభుత్వం. వీధి ఫుడ్ లో మాంసాహారాన్ని బహిరంగంగా అమ్మకూడదంటూ ఆంక్షలు విధించారు.

Non-veg food: నాన్ వెజ్ ఫుడ్ దాచి పెట్టి అమ్మండి.. లేదంటే శిక్ష తప్పదు

Non Veg Food

Updated On : November 12, 2021 / 8:02 PM IST

Non-veg food: మాంసాహారంపై కఠిన ఆంక్షలు మొదలుపెట్టింది గుజరాత్ ప్రభుత్వం. నాన్ వెజ్ ఫుడ్ వీధిలో అమ్మే సమయంలో బహిరంగ ప్రదర్శనకు ఉంచకూడదని ఆంక్షలు విధించారు. అలా అమ్మకం జరిపే స్టాల్స్, దుకాణాలు మాంసాహారాన్ని కచ్చితంగా మూసి ఉంచాలని చెప్పారు. చివరికి గుడ్లతో తయారుచేసిన వంటకాన్నైనా బహిరంగ అమ్మకానికి వీల్లేదని చెప్పింది.

గుజరాత్ లోని రాజ్‌కోట్ సిటీలో ఈ నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. బహిరంగ ప్రదర్శనకు దూరంగా ఉంచి అమ్మకాలు జరపడమే కాకుండా..  సిటీలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వాటిని పరిమితం చేయాలని ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా మెయిన్ రోడ్లకు దూరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

నిబంధనలు సిటీ అంతా అమలు కావాలని చెప్పడంతో వడోదరా మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ హితేంద్ర పటేల్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

…………………………………… : టీడీపీ రైతుల పాదయాత్రపై మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్!

‘ఫుడ్ స్టాల్స్.. ప్రత్యేకించి చేప, మాంసం, గుడ్లు అమ్మే దుకాణాలు మెయిన్ రోడ్ కు దూరంగా ఉండాలి. అమ్మకానికి ముందు వాటిని బహిరంగ ప్రదర్శనకు ఉంచకూడదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దారిలో పోయేవారికి కనపడకుండా ఉంచడం ద్వారా మతపరమైన అంశాల దృష్ట్యా సమస్యలు ఉండవు. గతంలో చేసిన ఈ తప్పులని సరిదిద్దాల్సిన సమయం వచ్చింది’ అని పటేల్ అన్నారు.