Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు

బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు హల్ చల్ చేసింది. దానిని చూసేందుకు స్ధానికులు ఎగబడ్డారు. ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు

Bengaluru

Updated On : July 27, 2023 / 7:05 PM IST

Bengaluru : డ్రైవర్ లేని కారుని ఎప్పుడైనా చూసారా? బెంగళూరు సిటీ రోడ్లపై పరుగులు తీసింది. ఈ కారుకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

MS Dhoni Driving Luxury Car : పాత‌కాలం నాటి ల‌గ్జ‌రీ కారులో ధోని చ‌క్క‌ర్లు.. ప‌క్క‌న ఎవ‌రు కూర్చున్నారో తెలుసా..?

అనిరుధ్ రవిశంకర్ అనే ట్విట్టర్ యూజర్ (anirudh ravishankar) షేర్ చేసిన డ్రైవర్ లేని కారు వీడియో అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. బెంగళూరు రోడ్లపై తిరుగుతుంటే స్ధానికులు దానిని వింతగా చూసారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలోని వాహనంలా కనిపించిన ఈ కారు వీడియోని ‘బెంగళూరు వీధుల్లో’ అంటూ అనిరుధ్ రవిశంకర్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు అనేక రీట్వీట్లు చేశారు. ఈ కారుపై ఆసక్తి చూపారు.

Onam Discounts : కొత్త కారు కొంటున్నారా? టాటా కార్లపై రూ. 80వేల వరకు డిస్కౌంట్లు.. ఏ కారు మోడల్ ధర ఎంతంటే?

‘ఇండియన్ సైబర్ ట్రక్’ అని.. ‘ఇది 27 వ ప్రధాన రహదారి లేన్‌లో కనిపించిందని.. దీనిని పరీక్షిస్తున్నారని’ కామెంట్లు చేశారు. zPod అనేది సెల్ఫ్ డ్రైవింగ్ కారును బెంగళూరులోని ఒక అటానమస్ మొబిలిటీ స్టార్టప్ అయిన మైనస్ జీరో తయారు చేసింది. ప్రస్తుతం ఇది ఇంకా ప్రయోగ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.