Viral Video : పాముతో ఆటలాడుతున్న చిన్నారి.. వీడియో తీసిన వాళ్లు అజ్ఞానులంటూ నెటిజన్లు ఫైర్
పసి పిల్లలకు పాము ఏదో.. బొమ్మ ఏదో తెలీదు. ఓ చిన్నారి పాముతో ఆటలాడుతుంటే ఇంట్లో వాళ్లు హడలిపోయారు. ఇక వీడియో తీసేవాళ్లు సరే సరి.. ఈ వీడియోపై నెటిజన్లు గరం అవుతున్నారు.

Viral Video
Viral Video : ప్రాణాంతకమైన మరియు భయంకరమైన సరీసృపాలలో పాములు ఒకటి.. పాములు ప్రాణాలు తీస్తాయి. వాటిని చూస్తేనే జనం భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది ఓ చిన్నారి ఇంట్లో పాముతో ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Garden of snakes : తోటలో చెట్ల నిండా పాములే.. ఆ స్నేక్ గార్డెన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఇన్‌స్టాగ్రామ్‌లో f_l_addiction.official అనే యూజర్ షేర్ చేసిన వీడియో చూసి జనం షాకయ్యారు. వీడియోలో ఓ చిన్నారి పాముతో ఆడుతూ దాన్ని ఈడ్చుకుంటూ వెడుతున్నట్లు కనిపించింది. ఇక చిన్నారి చేసిన పనికి అక్కడ ఉన్న పెద్దవాళ్లు కూడా భయపడి పరుగులు తీయడం కనిపించింది. దానికి ఇంట్లోకి తేవద్దని చిన్నారికి సైగలు చేస్తారు. వేరే వ్యక్తి వచ్చి పామును పట్టుకుని ఉన్న చిన్నారికి అక్కడి నుంచి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో నిజంగానే షాక్‌కి గురి చేసింది.
Cobra Guards Tomatoes : టమాటాలకు కాపలాగా నాగుపాము
వీడియో చూసిన నెటిజన్లు ‘వీడియో తీస్తున్న వ్యక్తికి పిల్లవాడిని రక్షించాలని తెలియదా?’ అని .. ‘ ఆ చిన్నారి కుటుంబానికి అవార్డు ఇవ్వాలి.. పాము కాటేస్తే చికిత్సకు మార్గం లేదు.. అజ్ఞానుల్లా ఉన్నారంటూ’ కామెంట్లు పెట్టారు. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియలేదు కానీ 17 లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది.
View this post on Instagram